Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ఆహిరి ఆ: స రి1 స గ3 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ద1 ప మ1 గ3 రి1 స రాగం: కురిన్జి ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2 అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స తాళం: ఆది పల్లవి సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥ (2) చరణం 1 పొలసు మేనివాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెకా । (2) గొలుసుల వంకల కోరలతోబూమి వెలిసినాడు సూడవే సిన్నెకా ॥ (2) సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు..(ప..) (2) చరణం 2 మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెకా । (2) ఆటదానిబాసి అడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెకా ॥ (2) సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు..(ప..) (2) చరణం 3 బింకపు మోతల పిల్లగోవివాడు సింక సూపులవాడు సిన్నెకా ।(2) కొంకక కలికియై కొసరి కూడె నన్ను వేంకటేశుడు సూడవే సిన్నెకా ॥ (2) సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు వెరపెరుగడు సూడవే సిన్నెకా ॥ (2)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: