Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: పాడి / పహాడి (29 ధీర శన్కరాభరణం జన్య)/మోహన ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ద2 ప గ3 రి2 స తాళం: ఆది పల్లవి తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ । సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥ చరణం 1 సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ । సరసవైభవరాయ సకలవినోదరాయ । (2) వరవసంతములరాయ వనితలవిటరాయ । (2) గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ॥ (2) తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..) చరణం 2 గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ । చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ । (2) చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ । (2) కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ॥ (2) తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ..(ప..) చరణం 3 సామసంగీతరాయ సర్వమోహనరాయ । ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ । (2) కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను । (2) శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ॥ (2) తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ । సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: