Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: శ్రీ (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స తాళం: ఖన్డ చాపు 01:21-పల్లవి వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం ॥ (2.5) చరణం 1 ఇందీవర శ్యామ మిందిరా కుచతటీ- చందనాంకిత లసత్చారు దేహం । (2) మందార మాలికా మకుట సంశోభితం (2) కందర్పజనక మరవిందనాభం ॥ (2) వందే వాసుదేవం బృందారకాధీశ..(ప..) చరణం (2) ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనం । (2) నిగమాదిసేవితం నిజరూపశేషప- (2) న్నగరాజ శాయినం ఘననివాసం ॥ (2) వందే వాసుదేవం బృందారకాధీశ చరణం 3 కరిపురనాథ సంరక్షణే తత్పరం కరిరాజవరద సంగతకరాబ్జం । (2) సరసీరుహాననం చక్రవిభ్రాజితం (2) తిరు వేంకటాచలాధీశం భజే ॥ (2) వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts