Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మధ్యోద్భవే భువ ఇలావృతనామ్ని వర్షే గౌరీప్రధానవనితాజనమాత్రభాజి । శర్వేణ మంత్రనుతిభిః సముపాస్యమానం సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వామ్ ॥1॥
భద్రాశ్వనామక ఇలావృతపూర్వవర్షే భద్రశ్రవోభిః ఋషిభిః పరిణూయమానమ్ । కల్పాంతగూఢనిగమోద్ధరణప్రవీణం ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతమ్ ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే ప్రహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్ । ఉత్తుంగశాంతధవలాకృతిమేకశుద్ధ- జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతమ్ ॥3॥
వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే లీలావిశేషలలితస్మితశోభనాంగమ్ । లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వామ్ ॥4॥
రమ్యే హ్యుదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే తద్వర్షనాథమనువర్యసపర్యమాణమ్ । భక్తైకవత్సలమమత్సరహృత్సు భాంతం మత్స్యాకృతిం భువననాథ భజే భవంతమ్ ॥5॥
వర్షం హిరణ్మయసమాహ్వయమౌత్తరాహ- మాసీనమద్రిధృతికర్మఠకామఠాంగమ్ । సంసేవతే పితృగణప్రవరోఽర్యమా యం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ ॥6॥
కించోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా సంసేవితో మహితమంత్రనుతిప్రభేదైః । దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా త్వం పాహి బిజ్ఞనుత యజ్ఞవరాహమూర్తే ॥7॥
యామ్యాం దిశం భజతి కింపురుషాఖ్యవర్షే సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా । సీతాభిరామపరమాద్భుతరూపశాలీ రామాత్మకః పరిలసన్ పరిపాహి విష్ణో ॥8॥
శ్రీనారదేన సహ భారతఖండముఖ్యై- స్త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః । ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ నారాయణో నరసఖః పరిపాహి భూమన్ ॥9॥
ప్లాక్షేఽర్కరూపమయి శాల్మల ఇందురూపం ద్వీపే భజంతి కుశనామని వహ్నిరూపమ్ । క్రౌంచేఽంబురూపమథ వాయుమయం చ శాకే త్వాం బ్రహ్మరూపమపి పుష్కరనామ్ని లోకాః ॥10॥
సర్వైర్ధ్రువాదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః । త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్ ॥11॥
పాతాలమూలభువి శేషతనుం భవంతం లోలైకకుండలవిరాజిసహస్రశీర్షమ్ । నీలాంబరం ధృతహలం భుజగాంగనాభి- ర్జుష్టం భజే హర గదాన్ గురుగేహనాథ ॥12॥
Browse Related Categories: