Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సత్రాజితస్త్వమథ లుబ్ధవదర్కలబ్ధం దివ్యం స్యమంతకమణిం భగవన్నయాచీః । తత్కారణం బహువిధం మమ భాతి నూనం తస్యాత్మజాం త్వయి రతాం ఛలతో వివోఢుమ్ ॥1॥
అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా ప్రసేనస్తద్భ్రాతా గలభువి వహన్ ప్రాప మృగయామ్ । అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్ కపీంద్రస్తం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్ ॥2॥
శశంసుః సత్రాజిద్గిరమను జనాస్త్వాం మణిహరం జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా । తతః సర్వజ్ఞోఽపి స్వజనసహితో మార్గణపరః ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతోఽభూః కపిగుహామ్ ॥3॥
భవంతమవితర్కయన్నతివయాః స్వయం జాంబవాన్ ముకుందశరణం హి మాం క ఇహ రోద్ధుమిత్యాలపన్ । విభో రఘుపతే హరే జయ జయేత్యలం ముష్టిభి- శ్చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణిః ॥4॥
బుధ్వాఽథ తేన దత్తాం నవరమణీం వరమణిం చ పరిగృహ్ణన్ । అనుగృహ్ణన్నముమాగాః సపది చ సత్రాజితే మణిం ప్రాదాః ॥5॥
తదను స ఖలు బ్రీలాలోలో విలోలవిలోచనాం దుహితరమహో ధీమాన్ భామాం గిరైవ పరార్పితామ్ । అదిత మణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి ప్రముదితమనాస్తస్యైవాదాన్మణిం గహనాశయః ॥6॥
వ్రీలాకులాం రమయతి త్వయి సత్యభామాం కౌంతేయదాహకథయాథ కురూన్ ప్రయాతే । హీ గాందినేయకృతవర్మగిరా నిపాత్య సత్రాజితం శతధనుర్మణిమాజహార ॥7॥
శోకాత్ కురూనుపగతామవలోక్య కాంతాం హత్వా ద్రుతం శతధనుం సమహర్షయస్తామ్ । రత్నే సశంక ఇవ మైథిలగేహమేత్య రామో గదాం సమశిశిక్షత ధార్తరాష్ట్రమ్ ॥8॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
అక్రూర ఏష భగవన్ భవదిచ్ఛయైవ సత్రాజితః కుచరితస్య యుయోజ హింసామ్ । అక్రూరతో మణిమనాహృతవాన్ పునస్త్వం తస్యైవ భూతిముపధాతుమితి బ్రువంతి ॥9॥
భక్తస్త్వయి స్థిరతరః స హి గాందినేయ- స్తస్యైవ కాపథమతిః కథమీశ జాతా । విజ్ఞానవాన్ ప్రశమవానహమిత్యుదీర్ణం గర్వం ధ్రువం శమయితుం భవతా కృతైవ ॥10॥
యాతం భయేన కృతవర్మయుతం పునస్త- మాహూయ తద్వినిహితం చ మణిం ప్రకాశ్య । తత్రైవ సువ్రతధరే వినిధాయ తుష్యన్ భామాకుచాంతశయనః పవనేశ పాయాః ॥11॥
Browse Related Categories: