Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రామ లాలీ మేఘశ్యామ లాలీ తామరసా నయన దశరథ తనయ లాలీ ॥
అచ్చావదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥
జోల పాడి జోకొట్టితె ఆలకించెవు చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts