Svarajatis - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: బిళహరి (మేళకర్త 29, ధీర శంకరాభరణం జన్యరాగ) స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం ఆరోహణ: స . రి2 . గ3 . . ప . ద2 . . స' అవరోహణ: స' ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స తాళం: చతురస్ర జాతి త్రిపుట (ఆది) తాళం అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ భాషా: తెలుగు సాహిత్యం పల్లవి రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల అనుపల్లవి సారసాక్ష నేరమేమి మరుబాధ కోర్వలేరా చరణం 1 నందగోపాలా నే నెందు పోజాలా నీ విందు రారా సదమలమదితో ముదమలరగ నాకెదురుగ గదియరా (రార వేణు) చరణం 2 పలుమారును గారవమున నిన్ పిలచిన పలుకవు నలుగకురా కరివరద! మరిమరి నా యధరము గ్రోలరా కనికరముగ (రార వేణు) చరణం 3 రా నగధర రా మురహర రా భవహర రావేరా ఈ మగువను ఈ లలలను ఈ సొగసిని చేకోరా కోరికలింపొంద డెందము నీయందు చేరెను నీ చెన్- త మరువకురా కరములచే మరిమరి నిను శరణనెదర (రార వేణు) స్వరాః పల్లవి
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: