Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ప్రాచేతసస్తు భగవన్నపరో హి దక్ష- స్త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః । ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహు- స్తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్ ॥1॥
తస్యాత్మజాస్త్వయుతమీశ పునస్సహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః । నైకత్రవాసమృషయే స ముమోచ శాపం భక్తోత్తమస్త్వృషిరనుగ్రహమేవ మేనే ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్ దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః । త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః ॥3॥
ప్రాక్శూరసేనవిషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్ । లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ- సంఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ ॥4॥
తం నారదస్తు సమమంగిరసా దయాలుః సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవమ్ । కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త ॥5॥
స్తోత్రం చ మంత్రమపి నారదతోఽథ లబ్ధ్వా తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ । విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్ ॥6॥
తస్మై మృణాలధవలేన సహస్రశీర్ష్ణా రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన । ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో దత్వాఽఽత్మతత్త్వమనుగృహ్య తిరోదధాథ ॥7॥
త్వద్భక్తమౌలిరథ సోఽపి చ లక్షలక్షం వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్ । సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః సంగాతిరేకరహితో లలితం చచార ॥8॥
అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో నూనం స రూప్యగిరిమాప్య మహత్సమాజే । నిశ్శంకమంకకృతవల్లభమంగజారిం తం శంకరం పరిహసన్నుమయాభిశేపే ॥9॥
నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ । భక్త్యాత్మతత్త్వకథనైః సమరే విచిత్రం శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే ॥10॥
త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాఽపి తాన్ప్రత్యుతేంద్రసుహృదో మరుతోఽభిలేభే । దుష్టాశయేఽపి శుభదైవ భవన్నిషేవా తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ ॥11॥
Browse Related Categories: