Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ॥ కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు । తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు । సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు । సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ॥ నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు । శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts