Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం:అట్టతాళం పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా ॥ కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా । గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా ॥ భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ । కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా ॥ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా । బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts