Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి ॥ అరుదుగ మును నరకాసురుడు । సిరులతో జెరలు దెచ్చిన సతుల । పరువపు వయసుల బదారు వేలను । సొరిది బెండ్లాడిన సుముఖునికి ॥ చెందిన వేడుక శిశుపాలుడు । అంది పెండ్లాడగ నవగళించి । విందువలెనె తా విచ్చేసి రుకుమిణి । సందడి బెండ్లాడిన సరసునుకి ॥ దేవదానవుల ధీరతను । దావతిపడి వార్థి దరుపగను । శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన । శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: