Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: నాదనామక్రియా ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3 తాళం: ఆది పల్లవి బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ॥ (2.5)` చరణం 1 కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ । (2) ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ (2) తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ॥ చరణం 2 నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర - అదియు నొకటే । (2) మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే చండాలుడుండేటి సరిభూమి యొకటే ॥ (2) తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన చరణం 3 అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే । దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటేరణం వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ॥ చరణం 4 కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే । పరగ దుర్గంధములపై వాయు వొకటే వరస పరిమళముపై వాయు వొకటే ॥ చరణమ5 కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు నెండొకటే । (2) కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ॥ (2) తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts