Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: సూర్యకాంతం విడువవిడువనింక విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ॥ పరమాత్మ నీవెందో పరాకైయున్నాను పరగ నన్నింద్రియాలు పరచినాను । ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంక~మ దొడికి తీసినను ॥ పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ వట్టి ముదిమైన రానీ వయసే రానీ । చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ॥ యీదేహమే యయిన ఇక నొకటైనాను కాదు గూడదని ముక్తి కడకేగినా । శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు సోదించి నీశరణమే చొచ్చితి నేనికను ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: