Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మధ్యమావతి తాళం: ఝంప
పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥
శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥
సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥
ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥
ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥
పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో ॥ 5 ॥ పాహిరామప్రభో ॥
కందర్పజనక నాయందు రంజిల సదా నందుడవై పూజలందు రామప్రభో ॥ 6 ॥ పాహిరామప్రభో ॥
ఇంపుగా జెవులకు న్విందుగా నీకథల్ కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో ॥ 7 ॥ పాహిరామప్రభో ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
వందనముచేసి మునులందరు ఘనులైరి విందవైనట్టి గోవింద రామప్రభో ॥ 8 ॥ పాహిరామప్రభో ॥
బృందారకాది సద్బృందార్చితావతార వింద ముని సందర్శితానంద రామప్రభో ॥ 9 ॥ పాహిరామప్రభో ॥
తల్లివినీవె మాతండ్రివినీవె మా ధాతవునీవె మాభ్రాత రామప్రభో ॥ 10 ॥ పాహిరామప్రభో ॥
పల్లవాధరలైన గొల్లభామలగూడి యుల్లమలరంగ రంజిల్లు రామప్రభో ॥ 11 ॥ పాహిరామప్రభో ॥
మల్లరంగంబునందెల్ల మల్లులజీరి యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో ॥ 12 ॥ పాహిరామప్రభో ॥
కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ సల్లాపమున క్రీడసల్పు రామప్రభో ॥ 13 ॥ పాహిరామప్రభో ॥
తమ్ముడును నీవు పార్శ్వమ్ములంజేరి వి ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో ॥ 14 ॥ పాహిరామప్రభో ॥
క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో ॥ 15 ॥ పాహిరామప్రభో ॥
రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్ నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 16 ॥ పాహిరామప్రభో ॥
కంటి మీ శంఖమ్ము కంటి మీ చక్రము కంటి మీ పాదముల్గంటి రామప్రభో ॥ 17 ॥ పాహిరామప్రభో ॥
వింటి మహిమ వెన్నంటి తమ్ముడు నీవు జంటరావయ్య నావెంట రామప్రభో ॥ 18 ॥ పాహిరామప్రభో ॥
మేము నీవారమైనాము రక్షింపుమ న్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో ॥ 19 ॥ పాహిరామప్రభో ॥
నామనోవీధిని ప్రేమతోనుండు మీ భూమిజాసహిత జయ రామచంద్రప్రభో ॥ 20 ॥ పాహిరామప్రభో ॥
మీ మహత్త్వమ్ము విన మనమందు ప్రేమ వేమరున్ బుట్టు శ్రీరామచంద్రప్రభో ॥ 21 ॥ పాహిరామప్రభో ॥
శ్యామసుందర కోమలం జానకీమనః కాముకం త్వం భజే రామచంద్రప్రభో ॥ 22 ॥ పాహిరామప్రభో ॥
కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న నా మొరాలించు నాస్వామి రామప్రభో ॥ 23 ॥ పాహిరామప్రభో ॥
కామితప్రభుడవై ప్రేమతో రక్షించు స్వామి సాకేతపురి రామచంద్రప్రభో ॥ 24 ॥ పాహిరామప్రభో ॥
అన్న రావన్న నీకన్న నామీద నెన రున్న వారేరి నాయన్న రామప్రభో ॥ 25 ॥ పాహిరామప్రభో ॥
నిన్నెగాకను మరే యన్యులగానన్ గన్నతండ్రివిగ మాయన్న రామప్రభో ॥ 26 ॥ పాహిరామప్రభో ॥
వెన్నదొంగిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని న్నెన్నగా వశమె రావన్న రామప్రభో ॥ 27 ॥ పాహిరామప్రభో ॥
ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక నిన్నె నెమ్మదిని వర్ణింతు రామప్రభో ॥ 28 ॥ పాహిరామప్రభో ॥
ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని మన్నించి దయచేయుమన్న రామప్రభో ॥ 29 ॥ పాహిరామప్రభో ॥
పన్నగాధిపశాయి భావనాతీత ఆ పన్న నామనవి వినవన్న రామప్రభో ॥ 30 ॥ పాహిరామప్రభో ॥
మేటివాక్యంబు మీసాటిదైవంబు ము మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో ॥ 31 ॥ పాహిరామప్రభో ॥
పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో ॥ 32 ॥ పాహిరామప్రభో ॥
వేడుకోగానె నీజోడుకాడును నీవు కూడి రారయ్య నాతోడ రామప్రభో ॥ 33 ॥ పాహిరామప్రభో ॥
నేడు నాకోర్కె లీడేరగాజేసి కా పాడరా కరినేలు జాడ రామప్రభో ॥ 34 ॥ పాహిరామప్రభో ॥
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందు వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో ॥ 35 ॥ పాహిరామప్రభో ॥
చూడు మీభక్తులను గూడు మీరిపుల గో రాడు మీవల్ల గోవింద రామప్రభో ॥ 36 ॥ పాహిరామప్రభో ॥
పుండరీకాక్ష మార్తాండవంశోద్భవా ఖండలస్తుత్య కోదండ రామప్రభో ॥ 37 ॥ పాహిరామప్రభో ॥
కుండలిశయన భూమండలోద్ధరణ పా షండజనహరణ కోదండరామప్రభో ॥ 38 ॥ పాహిరామప్రభో ॥
నిండుదయతోడ నాయండ బాయకను నీ వుండి గాపాడు కోదండరామప్రభో ॥ 39 ॥ పాహిరామప్రభో ॥
జాతకౌతూహలం చక్షుకృత్యారమాం పూతసీతాపతే దాత రామప్రభో ॥ 40 ॥ పాహిరామప్రభో ॥
పాతకులలో మొదటి పాతకుడ నావంటి పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో ॥ 41 ॥ పాహిరామప్రభో ॥
భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖండించి సీతగైకొన్న విఖ్యాత రామప్రభో ॥ 42 ॥ పాహిరామప్రభో ॥
పూతనాకల్మషోద్ధూత పె\న్శత్రు సం హారి శ్రీసీతాసమేత రామప్రభో ॥ 43 ॥ పాహిరామప్రభో ॥
జాతినీతులులేక భూతలంబున దిరుగు ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో ॥ 44 ॥ పాహిరామప్రభో ॥
ఎప్పుడును గంటికి రెప్పవలె గాచి న న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో ॥ 45 ॥ పాహిరామప్రభో ॥
ఏదయా నీదయా యోదయాంభోనిధీ యాదిలేదయ్య నామీద రామప్రభో ॥ 46 ॥ పాహిరామప్రభో ॥
ఘోరరాక్షస గర్వహార విశ్వంభరో ద్ధార గుణసాంద్రవిస్తార రామప్రభో ॥ 47 ॥ పాహిరామప్రభో ॥
మోదమున నీవు నన్నాదుకోవయ్య గో దావరీ తీర భద్రాద్రి రామప్రభో ॥ 48 ॥ పాహిరామప్రభో ॥
నీదు బాణంబులను నాదుశత్రులబట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ॥ 49 ॥ పాహిరామప్రభో ॥
ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో ॥ 50 ॥ పాహిరామప్రభో ॥
చాలదేమి పదాబ్జములసాటి యీపదు నాల్గులోకంబుల గూడి రామప్రభో ॥ 51 ॥ పాహిరామప్రభో ॥
ఏల యీలాగు జాగేల జేసెదవు మ మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో ॥ 52 ॥ పాహిరామప్రభో ॥
పాలువెన్నలు మ్రుచ్చిలింతివని యశోద రోటగట్టిన మాయచాలు రామప్రభో ॥ 53 ॥ పాహిరామప్రభో ॥
కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో నల్లబిల్లిగను రంజిల్ల రామప్రభో ॥ 54 ॥ పాహిరామప్రభో ॥
వాలి నొక్కమ్మునన్ గూలవేసిన శౌర్య శాలియౌ నినుదలతు జాల రామప్రభో ॥ 55 ॥ పాహిరామప్రభో ॥
సాలభంజికల నిర్మూలంబు చేయగా జాలితివి గోపాలబాల రామప్రభో ॥ 56 ॥ పాహిరామప్రభో ॥
తాళవృక్షము లొక్కకోల ధరగూలగా లీలనేసిన బాహుశాలి రామప్రభో ॥ 57 ॥ పాహిరామప్రభో ॥
(శిలయైన యహల్య శ్రీపాదములు సోక నెలతయై మిము మదితలచె ॥ 58 ॥ పాహిరామప్రభో ॥)
వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో ॥ 59 ॥ పాహిరామప్రభో ॥
దానధర్మంబులున్ దపజపంబులు నీదు నామకీర్తనకు సరిరావు రామప్రభో ॥ 60 ॥ పాహిరామప్రభో ॥
మానావమానములు మహిని నీవై యుండ మాకేల మదిని ఈచింత రామప్రభో ॥ 61 ॥ పాహిరామప్రభో ॥
జ్ఞానయోగాభ్యాసమందు నుండెడివారి కానందమయుడవైనావు రామప్రభో ॥ 62 ॥ పాహిరామప్రభో ॥
భానువంశమునందు మానవాధిపుడవై దానవుల బరిమార్చినావు రామప్రభో ॥ 63 ॥ పాహిరామప్రభో ॥
అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా మనవి విను దేవకీతనయ రామప్రభో ॥ 64 ॥ పాహిరామప్రభో ॥
మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో ॥ 65 ॥ పాహిరామప్రభో ॥
నిత్యమై సత్యమై నిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో ॥ 66 ॥ పాహిరామప్రభో ॥
సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన శ్రావ్యమై యుండునో దివ్య రామప్రభో ॥ 67 ॥ పాహిరామప్రభో ॥
గట్టిగా నీవున\న్ పట్టుగా విహితమౌ నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో ॥ 68 ॥ పాహిరామప్రభో ॥
దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి పట్టి యాగము గాచినట్టి రామప్రభో ॥ 69 ॥ పాహిరామప్రభో ॥
చుట్టుకొని కాళింగు డట్టహాసముచేయ పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో ॥ 70 ॥ పాహిరామప్రభో ॥
సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి మ్మెంతురా జానకీకాంత రామప్రభో ॥ 71 ॥ పాహిరామప్రభో ॥
పంతమున మీ పాదచింతనము చేయ నా వంతలన్నియు మానుటెంత రామప్రభో ॥ 72 ॥ పాహిరామప్రభో ॥
వింతగాదయ్య నేనింతనాడినది నా పంతమున మిమ్ము భావింతు రామప్రభో ॥ 73 ॥ పాహిరామప్రభో ॥
శాంతమూర్తిని రమాకాంతుడవని చాల సంతసంబున నిన్ను నెంతు రామప్రభో ॥ 74 ॥ పాహిరామప్రభో ॥
అక్షయంబైన నీకుక్షిలో లోకముల రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో ॥ 75 ॥ పాహిరామప్రభో ॥
దంతివత్సల భక్తచింతామణీ విశ్వ మంతయును నీవు రక్షించు రామప్రభో ॥ 76 ॥ పాహిరామప్రభో ॥
పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను రక్షించు మోక్షప్రదాత రామప్రభో ॥ 77 ॥ పాహిరామప్రభో ॥
రక్షించి సజ్జనుల వీక్షించి దుర్జనుల రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 78 ॥ పాహిరామప్రభో ॥
రక్షకుడవై జగద్రక్షణముచేయగా రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 79 ॥ పాహిరామప్రభో ॥
లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా కక్షయంబుగ కటాక్షించు రామప్రభో ॥ 80 ॥ పాహిరామప్రభో ॥
రావయా అభయంబు లీవయా నాస్వామీ నీవయా గతి దేవరాయ రామప్రభో ॥ 81 ॥ పాహిరామప్రభో ॥
కావు కావుమటంచు కాకాసురుడురాగ కాచి రక్షించినావయ్య రామప్రభో ॥ 82 ॥ పాహిరామప్రభో ॥
దేవదేవోత్తమా దేవేంద్రసన్నుతా కావవేనన్ను శ్రీరామచంద్రప్రభో ॥ 83 ॥ పాహిరామప్రభో ॥
భావజజనక నా బాధలన్నియుమాన్పి యే విధంబునైన నేలు రామప్రభో ॥ 84 ॥ పాహిరామప్రభో ॥
శ్రీవైష్ణవులపాలి చింతామణివి చాల సేవగైకొని కరుణచేయు రామప్రభో ॥ 85 ॥ పాహిరామప్రభో ॥
భావమున మిముభక్తి సేవించు జనులకు కైవల్యమొసగు శ్రీరామచంద్రప్రభో ॥ 86 ॥ పాహిరామప్రభో ॥
గోపాలురను గూడి యావులను మేపి ఆపదోద్ధారకుడవైన రామప్రభో ॥ 87 ॥ పాహిరామప్రభో ॥
నాపాలి శ్రీరామ భూపాలకా నను కాపాడరావ గోపాల రామప్రభో ॥ 88 ॥ పాహిరామప్రభో ॥
సారమౌశౌర్య విస్తారమౌ సుందరా కారసద్భక్తమందార రామప్రభో ॥ 89 ॥ పాహిరామప్రభో ॥
శరణాగతత్రాణ బిరుదాంకితంబైన వరము నాకొసగు యేమరక రామప్రభో ॥ 90 ॥ పాహిరామప్రభో ॥
శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె సారెకును వింతగా జదువ రామప్రభో ॥ 91 ॥ పాహిరామప్రభో ॥
శ్రీరామ నీనామ చింతనామృతపాన సారమే నాదుమది గోరు రామప్రభో ॥ 92 ॥ పాహిరామప్రభో ॥
చేరి మీపాద పద్మారాధనము చేయ కోరినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 93 ॥ పాహిరామప్రభో ॥
ఘోరరాక్షసగర్వహారి విశ్వంభరా భూరిగుణసాంద్ర విస్తార రామప్రభో ॥ 94 ॥ పాహిరామప్రభో ॥
మారీచమాయానివార శరసంధాన ధారుణీతనయా విహార రామప్రభో ॥ 95 ॥ పాహిరామప్రభో ॥
పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న న్నరసి పోషింపగదవయ్య రామప్రభో ॥ 96 ॥ పాహిరామప్రభో ॥
పరధనంబును పరస్త్రీల నపేక్షించు నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో ॥ 97 ॥ పాహిరామప్రభో ॥
కామాదిదుర్గుణ స్తోమంబులడగ మీ నామామృతమె దిక్కు రామచంద్రప్రభో ॥ 98 ॥ పాహిరామప్రభో ॥
దుష్టులగు దానవుల నష్టంబుగా జేయగా బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో ॥ 99 ॥ పాహిరామప్రభో ॥
కష్టపడలేనయ్య పట్టాభిరామ నా కిష్టసంపదలిచ్చి యేలు రామప్రభో ॥ 100 ॥ పాహిరామప్రభో ॥
కేశవాయనిన భవపాశముళొలగు స ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో ॥ 101 ॥ పాహిరామప్రభో ॥
నారాయణా నీదు నామామృతం బెపుడు పారాయణము చేతు నేను రామప్రభో ॥ 102 ॥ పాహిరామప్రభో ॥
మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు సాధుసజ్జనదయాంభోధి రామప్రభో ॥ 103 ॥ పాహిరామప్రభో ॥
గోవింద గోవింద గోపాలకృష్ణయని గోపకులు గొనియాడు గోపరామప్రభో ॥ 104 ॥ పాహిరామప్రభో ॥
విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో ॥ 105 ॥ పాహిరామప్రభో ॥
శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం గాధర స్తోత్ర యానంద రామప్రభో ॥ 106 ॥ పాహిరామప్రభో ॥
మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుంచి తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో ॥ 107 ॥ పాహిరామప్రభో ॥
కూర్మరూపము నొంది కొండమూపునదాల్చి కూర్మితో నమృతంబుగూర్చి రామప్రభో ॥ 108 ॥ పాహిరామప్రభో ॥
వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి సురల రక్షించు దాశరథి రామప్రభో ॥ 109 ॥ పాహిరామప్రభో ॥
శరణన్న ప్రహ్లాదు గరుణించి రక్షింప నరసింహమూర్తివైనట్టి రామప్రభో ॥ 110 ॥ పాహిరామప్రభో ॥
వామనత్వమున భూదానమడిగియు బలిని భూమిక్రిందనడంచి పొల్చు రామప్రభో ॥ 111 ॥ పాహిరామప్రభో ॥
పరశురాముడనంగ నరపాలకులనెల్ల నరసిపొరికొన్న దాశరథి రామప్రభో ॥ 112 ॥ పాహిరామప్రభో ॥
శ్రీరామమూర్తివై యారావణుని తలల్ ధారుణిన్ పడగూర్చినావు రామప్రభో ॥ 113 ॥ పాహిరామప్రభో ॥
హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో ॥ 114 ॥ పాహిరామప్రభో ॥
సిద్ధసన్నుత మనోబద్ధుండవై నీవు బౌద్ధుండవైతి ప్రబుద్ధ రామప్రభో ॥ 115 ॥ పాహిరామప్రభో ॥
కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో ॥ 116 ॥ పాహిరామప్రభో ॥
అవ్యయుడవైన నీయవతారముల జూచి దివ్యులైనారు మునులయ్య రామప్రభో ॥ 117 ॥ పాహిరామప్రభో ॥
శ్రీరామనామమే వేళస్మరియింతు స్వామి దయచేయు సంపదను రామప్రభో ॥ 118 ॥ పాహిరామప్రభో ॥
అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో ॥ 119 ॥ పాహిరామప్రభో ॥
తెప్పరంబులుదీర్చి యిప్పుడేమరక నన్ ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో ॥ 120 ॥ పాహిరామప్రభో ॥
పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల పాలింపుమా భద్రశైలి రామప్రభో ॥ 121 ॥ పాహిరామప్రభో ॥
పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని కష్టపెట్టకను చేపట్టు రామప్రభో ॥ 122 ॥ పాహిరామప్రభో ॥
Browse Related Categories: