Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర ॥ మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున । జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి । చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర ॥ బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము । వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: