Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ॥ (2.5) చరణం 1 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । (3.5) పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన ॥ (2.5) మనుజుడై పుట్టి మనుజుని సేవించి (ప.) అనుదినమును దుఃఖమందనేలా (ప.) చరణం 2 అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటు తానై । అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి అందరాని పద మందెనటుగాన ॥ మనుజుడై పుట్టి మనుజుని సేవించి (ప.) అనుదినమును దుఃఖమందనేలా (ప.)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: