Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ముఖారి నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ॥ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము । యెట్టనెదుటి కలదీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము ॥ కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము । వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినపుడే కైవల్యము ॥ తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము । ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts