Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు । పరగి నానా విద్యల బలవంతుడు ॥ రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు । దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు ॥ లలిమీరిన యట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు । నెలకొన్న లంకా నిర్థూమధాముడు తలపున శ్రీరాము నాత్మారాముడు ॥ దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపః ఫల పుణ్యుడు । శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: