Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ॥ ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు । తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ॥ వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు । గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ॥ ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు । అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts