Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: బొవ్ళి (15 మాయమాళవ గొవ్ళ జన్య) ఆ: స రి1 గ3 ప ద1 స అవ: స ని3 ద1 ప గ3 రి1 స తాళం: ఆది పల్లవి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ । శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥ చరణం 1 కమలాసతీ ముఖకమల కమలహిత । కమలప్రియ కమలేక్షణ । కమలాసనహిత గరుడగమన శ్రీ । కమలనాభ నీపదకమలమే శరణు ॥ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ..(ప..) చరణం 2 పరమయోగిజన భాగధేయ శ్రీ । పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీ । తిరువేంకటగిరి దేవ శరణు ॥ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ । శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts