Nitya Parayana · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: హంసధ్వని (స, రి2, గ3, ప, ని3, స)
వాతాపి గణపతిం భజేఽహం వారణాశ్యం వరప్రదం శ్రీ ।
భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణమ్ । వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణమ్ ।
పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితమ్ ।
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుఖండమ్ ।
కరాంబుజ పాశ బీజాపూరం కలుషవిదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్ ।
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.