Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
వ్రజేశ్వరైః శౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వని భీతచేతాః । నిష్పిష్టనిశ్శేషతరుం నిరీక్ష్య కంచిత్పదార్థం శరణం గతస్వామ్ ॥1॥
నిశమ్య గోపీవచనాదుదంతం సర్వేఽపి గోపా భయవిస్మయాంధాః । త్వత్పాతితం ఘోరపిశాచదేహం దేహుర్విదూరేఽథ కుఠారకృత్తమ్ ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
త్వత్పీతపూతస్తనతచ్ఛరీరాత్ సముచ్చలన్నుచ్చతరో హి ధూమః । శంకామధాదాగరవః కిమేష కిం చాందనో గౌల్గులవోఽథవేతి ॥3॥
మదంగసంగస్య ఫలం న దూరే క్షణేన తావత్ భవతామపి స్యాత్ । ఇత్యుల్లపన్ వల్లవతల్లజేభ్యః త్వం పూతనామాతనుథాః సుగంధిమ్ ॥4॥
చిత్రం పిశాచ్యా న హతః కుమారః చిత్రం పురైవాకథి శౌరిణేదమ్ । ఇతి ప్రశంసన్ కిల గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్ ॥5॥
దినేదినేఽథ ప్రతివృద్ధలక్ష్మీరక్షీణమాంగల్యశతో వ్రజోఽయమ్ । భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోదసాంద్రః పరితో విరేజే ॥6॥
గృహేషు తే కోమలరూపహాసమిథఃకథాసంకులితాః కమన్యః । వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షాసమాగతాః ప్రత్యహమత్యనందన్ ॥7॥
అహో కుమారో మయి దత్తదృష్టిః స్మితం కృతం మాం ప్రతి వత్సకేన । ఏహ్యేహి మామిత్యుపసార్య పాణీ త్వయీశ కిం కిం న కృతం వధూభిః ॥8॥
భవద్వపుఃస్పర్శనకౌతుకేన కరాత్కరం గోపవధూజనేన । నీతస్త్వమాతామ్రసరోజమాలావ్యాలంబిలోలంబతులామలాసీః ॥9॥
నిపాయయంతీ స్తనమంకగం త్వాం విలోకయంతీ వదనం హసంతీ । దశాం యశోదా కతమాం న భేజే స తాదృశః పాహి హరే గదాన్మామ్ ॥10॥
Browse Related Categories: