Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ॥
సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥
సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥
ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ॥
శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ । గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం శంఖంచక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ॥
హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.