Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
భవంతమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్ దదర్శ గగనోచ్చలజ్జలభరాం కలిందాత్మజామ్ । అహో సలిలసంచయః స పునరైంద్రజాలోదితో జలౌఘ ఇవ తత్క్షణాత్ ప్రపదమేయతామాయయౌ ॥1॥
ప్రసుప్తపశుపాలికాం నిభృతమారుదద్బాలికా- మపావృతకవాటికాం పశుపవాటికామావిశన్ । భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదా- ద్వహన్ కపటకన్యకాం స్వపురమాగతో వేగతః ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
తతస్త్వదనుజారవక్షపితనిద్రవేగద్రవద్- భటోత్కరనివేదితప్రసవవార్తయైవార్తిమాన్ । విముక్తచికురోత్కరస్త్వరితమాపతన్ భోజరా- డతుష్ట ఇవ దృష్టవాన్ భగినికాకరే కన్యకామ్ ॥3॥
ధ్రువం కపటశాలినో మధుహరస్య మాయా భవే- దసావితి కిశోరికాం భగినికాకరాలింగితామ్ । ద్విపో నలినికాంతరాదివ మృణాలికామాక్షిప- న్నయం త్వదనుజామజాముపలపట్టకే పిష్టవాన్ ॥4॥
తతః భవదుపాసకో ఝటితి మృత్యుపాశాదివ ప్రముచ్య తరసైవ సా సమధిరూఢరూపాంతరా । అధస్తలమజగ్ముషీ వికసదష్టబాహుస్ఫుర- న్మహాయుధమహో గతా కిల విహాయసా దిద్యుతే ॥5॥
నృశంసతర కంస తే కిము మయా వినిష్పిష్టయా బభూవ భవదంతకః క్వచన చింత్యతాం తే హితమ్ । ఇతి త్వదనుజా విభో ఖలముదీర్య తం జగ్ముషీ మరుద్గణపణాయితా భువి చ మందిరాణ్యేయుషీ ॥6॥
ప్రగే పునరగాత్మజావచనమీరితా భూభుజా ప్రలంబబకపూతనాప్రముఖదానవా మానినః । భవన్నిధనకామ్యయా జగతి బభ్రముర్నిర్భయాః కుమారకవిమారకాః కిమివ దుష్కరం నిష్కృపైః ॥7॥
తతః పశుపమందిరే త్వయి ముకుంద నందప్రియా- ప్రసూతిశయనేశయే రుదతి కించిదంచత్పదే । విబుధ్య వనితాజనైస్తనయసంభవే ఘోషితే ముదా కిము వదామ్యహో సకలమాకులం గోకులమ్ ॥8॥
అహో ఖలు యశోదయా నవకలాయచేతోహరం భవంతమలమంతికే ప్రథమమాపిబంత్యా దృశా । పునః స్తనభరం నిజం సపది పాయయంత్యా ముదా మనోహరతనుస్పృశా జగతి పుణ్యవంతో జితాః ॥9॥
భవత్కుశలకామ్యయా స ఖలు నందగోపస్తదా ప్రమోదభరసంకులో ద్విజకులాయ కిన్నాదదాత్ । తథైవ పశుపాలకాః కిము న మంగలం తేనిరే జగత్త్రితయమంగల త్వమిహ పాహి మామామయాత్ ॥10॥
Browse Related Categories: